హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖలో 2011 నాటి లికర్ సిండికేట్ కేసులో రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పింఛన్ వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టీ లక్ష్మణ్‌గౌడ్, టీజీవో నాయకులు రామారావు, శ్రీనిష్ నోరి, ఎన్ వెంకట్ కోరారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి పలు సమస్యలపై విన్నవించారు.
కానిస్టేబుళ్ల బదిలీలను చేపట్టిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐల బదిలీలను వెంటనే చేపట్టాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని యూనియన్ నేతలు తెలిపారు.