హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు(Employment guarantee laborer) చేస్తుండగా మట్టిపెళ్లలు మీదపడి ఒకరు మృతి(Died )చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన కోనారావుపేట మండటం వెంకట్రావుపేటలో చోటు చేసుకుంది. ప్రమాదంలోమార్పాక రాజవ్వ (45) మృతి చెందగా కర్ణాల లహరి, పల్లం దేవవ్వ, కర్నాల శ్యామల, ఎడ్ల రామవ్వ, వద్నాల అమృత, సందు చంద్రయ్య గాయపడ్డారు.
స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన జిల్లా హాస్పిటల్కు తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న జడ్పీ చైర్ పర్సన్ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి హాస్పిటల్కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.