గోపన్‌పల్లి ఉద్యోగుల భూమిలో దర్జాగా రోడ్డు.. పట్టించుకునే వారు కరువయ్యారని ఉద్యోగుల ఆందోళన
ఐటీ కారిడార్‌కు కూతవేటు దూరంలోని గోపన్‌పల్లిలో వేల కోట్ల విలువైన భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూముల్లో దర్జాగా రహదారి నిర్మాణం చేపడుతున్నారు.
- సర్వేనంబర్ 36లో అక్రమార్కుల బరితెగింపు
- కోర్టు వివాదంలో ఉన్న భూమిలో యథేచ్ఛగా రోడ్డు నిర్మాణ పనులు
శేరిలింగంపల్లి, మార్చి 20: ఐటీ కారిడార్‌కు కూతవేటు దూరంలోని గోపన్‌పల్లిలో వేల కోట్ల విలువైన భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూముల్లో దర్జాగా రహదారి నిర్మాణం చేపడుతున్నారు. పెద్దఎత్తున్న పొక్లెయినర్లు, జేసీబీలతో పట్టపగలు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులకు తెరలేపారు. రంగారెడ్డిజిల్లా, శేరిలింగంపల్లి మండలం, గోపనపల్లిలో సర్వేనంబర్ 36, 37లో ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్రంలో 428 ఎకరాల భూమిని కేటాయించారు. ఎనిమిది నెలల క్రితం భాగ్యనగర్ టీఎన్జీవోస్కు చెందిన సదరు లేఅవుట్లోని భూమిని కొందరు అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకోగా ఈ వివాదం కోర్టుకెక్కింది.
తాజాగా శుక్రవారం మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు గోపన్‌పల్లి ఎన్టీఆర్నగర్ ప్రధాన రహదారి నుంచి కొత్తగా 100 అడుగుల రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున టిప్పర్ల ద్వారా మట్టి డంపింగ్ చేసి జేసీబీలతో చదును చేస్తున్నారు. ఓ క్రషర్ సంస్థకు చెందిన ప్రైవేట్ వ్యక్తులు ఈ నిర్మాణ పనులు చేపట్టినట్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత శేరిలింగంపల్లి మం డల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డిని వివరణ కోరగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

