హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): నిధుల సమీకరణపై వివిధశాఖ ల దృష్టిపెట్టాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతీవా రం సమావేశం జరుగుతుందని చెప్పా రు.
ప్రస్తుత సమావేశంలోని నిర్ణయాలు, అమలులో పురోగతిని వచ్చేవారం సమీక్షిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆర్థికశాఖలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.