Koheda Victim | మా ప్రాణాలు తీసుకుంటడా.. తీసుకొని భూమి తీసుకోమను : కోహెడ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితురాలు
Koheda Victim | మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి రోడ్ల మీద పారేసిండు. చిన్న చిన్న పిల్లలను.. పెద్దపెద్దవాళ్లను అరెస్ట్ చేసిండు. ఆయన ఏమన్నా చేసుకొని మా భూమి మాకు కావాలె. మా ప్రాణాలు తీసుకుంటడా.. తీసుకొని భూమి తీసుకోమను అని కోహెడ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితురాలు ఫైర్ అయింది.
Koheda Victim | మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి రోడ్ల మీద పారేసిండు. మా ఊరి నుంచి ఒక పిల్లను కూడా రానీయలేదని కోహెడ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు, అధికార యంత్రాంగం, కాంగ్రెస్ సర్కార్ తీరుపై బాధితురాలు మాట్లాడుతూ.. వేరే వేరే ఊళ్ల నుంచి అందరినీ పైసలిచ్చి తెచ్చుకుండు. మా ఊరి నుంచి ఒక మనిషిని రానీయలే. పిల్లలను రానీయలేదు. చిన్న చిన్న పిల్లలను.. పెద్దపెద్దవాళ్లను అరెస్ట్ చేసిండు. ఆయన ఏమన్నా చేసుకొని మా భూమి మాకు కావాలె. మా ప్రాణాలు తీసుకుంటడా.. తీసుకొని భూమి తీసుకోమను అని ఫైర్ అయింది.
నా పెళ్లై 30 ఏండ్లు అయితుంది.. అప్పటి నుంచి ఈ భూమినే సాగు చేసుకుంటూ బతుకుతున్నం. మంచిగ చేస్తడని ఓటేసినం కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇట్ల చేస్తడని అనుకోలేదని బాధితురాలు వాపోయింది.. మళ్లీసారి అయితే ఓటేయ్యం ఆయనకు. పోలీసోళ్లు అయితే కొందరు మంచోళ్లు.. కొందరు చెడ్డోళ్లు ఉన్నరు. మా భూమి మాకు కావాలంటే మా ఆయనను అయితే రోడ్లమీదేసి గుంజిర్రు. కొన్ని నీళ్లు అయ్యి అని అడిగితే.. ఒక రోజు లేకుంటే సచ్చిపోతరా లేకుంటే ఇంటికి వెళ్లిపోండి అని స్థానిక సీఐ అంటే మేం పోకుండా రాత్రి ఇక్కడనే పండుకున్నం. తెల్లవారుజామునే 5:30 గంటలకు లేడీ పోలీసులు ఆడవాళ్లను మగవాళ్లను మగపోలీసులు తీసుకెళ్లారంటూ చెప్పుకొచ్చింది.
మా ప్రాణమైనా ఇస్తాం కానీ మా భూమిని మాత్రం వదులుకోము.
మా భూమి మాకు కావాలంటే.. మా ఆయనను కింద పడేసి కొట్టారు. పోలీసులు కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
మాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు.
ఒక్కరోజు అన్నం తినకపోతే సచ్చిపోతారా అని ఇక్కడి సీఐ అంటున్నాడు.
ఏదో… pic.twitter.com/EIlpnu8YCv
— BRS Party (@BRSparty) June 11, 2026
Read Also :
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

