IND-A vs AFG-A: ఇండియా-ఏకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. 4 రన్స్ తేడాతో విక్టరీ
IND-A vs AFG-A: ఇండియా-ఏ జట్టుకు పరాభవం ఎదురైంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టు చేతిలో ఓటమి పాలైంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం నమోదు చేసింది.
డంబుల్లా: ఇండియా-ఏ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టు షాక్ ఇచ్చింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్(IND-A vs AFG-A)లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నాలుగు రన్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. పలు మార్లు వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 49 ఓవర్లలో 349 రన్స్ చేసింది. కానీ ఆఫ్ఘన్‌కు 38 ఓవర్లలో 294 రన్స్‌ను టార్గెట్‌గా ఇచ్చారు. అయితే ఆఫ్ఘన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వర్షం అంతరాయం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 25.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 రన్స్ చేసింది.
అయితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆఫ్ఘన్ జట్టు నాలుగు పరుగులు ఆధిక్యంలో ఉన్నది. దీంతో అనూహ్యంగా ఇండియా-ఏ జట్టుకు షాక్ తగిలింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇమ్రాన్ 75, బహిర్ షా 51 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నారు. భారత జట్టులో ప్రభ్ సిమ్రన్ సింగ్ 84, తిలకవ్ వర్మ 66, రుతురాజ్ గైక్వాడ్ 66, వైభవ్ సూర్యవంశీ 44 రన్స్ చేశారు. అయితే ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఇమ్రాన్, బహిర్ మధ్య మూడో వికెట్లకు అజయేంగా 108 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. ఇది ఆ జట్టుకు కలిసి వచ్చింది.
Afghanistan A won by 4 runs (DLS Method).
India A will now shift focus towards their next fixture in the #TriNationSeries.
Scorecard ▶️ https://t.co/dMNsGrzIOD#INDAvAFGA pic.twitter.com/XDa1P3tNMg
— BCCI (@BCCI) June 11, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇక ఏఐ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

