హైదరాబాద్, మార్చి 26 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు. 2023-24లో 15,6 23 మెగావాట్ల డిమాండ్ నుంచి 202 4-25 మార్చి నెలలో 17,162మెగావాట్ల పీక్ డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. పదేండ్లలో ఇదే రికార్డు అని తెలిపారు. 2029-30 నాటికి 24,215 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉన్నదని, 203 4-35 నాటికి 31 వేల మెగావాట్లకు పెరుగుతుందని కేంద్రం అంచనా వేసినట్టు తెలిపారు.