Election Commission | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరో గంటపాటు పెంచింది. ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ సమయా న్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. వేసవిలో మే 13న పోలింగ్ జరుగనున్నందున ఇతర రాష్ర్టాల్లో మాదిరిగానే సా యంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయా న్ని పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం సానుకూల నిర్ణయం తీసుకున్నది. అయితే నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకు మా త్రమే పోలింగ్‌కు అనుమతించారు. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ అనుమతిస్తే ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమైంది.
ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం అనుకున్నంత స్థాయిలో జరుగడంలేదు. ఈ నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎన్నికల సంఘానికి పలు వినతులు అందాయి. అన్ని రాష్ర్టాల్లో గంటపాటు సమయం పెంచినందున ఇక్కడ కూడా గంటపాటు పెంచడానికి ఈసీ అనుమతి ఇచ్చింది.
సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉండే నియోజకవర్గాలు
అసెంబ్లీ నియోజకవర్గం : లోక్‌సభ నియోజకవర్గ పరిధి
1. సిర్పూర్ : ఆదిలాబాద్
2. ఆసిఫాబాద్ : ఆదిలాబాద్
3. చెన్నూరు : పెద్దపల్లి
4. బెల్లంపల్లి : పెద్దపల్లి
5. మంచిర్యాల : పెద్దపల్లి
6. మంథని : పెద్దపల్లి
7. భూపాలపల్లి : వరంగల్
8. ములుగు : మహబూబాబాద్
9. భద్రాచలం : మహబూబాబాద్
10. పినపాక : మహబూబాబాద్
11. ఇల్లందు : మహబూబాబాద్
12. కొత్తగూడెం : ఖమ్మం
13. అశ్వరావుపేట : ఖమ్మం