Election Code | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ
క్రమంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి
చేయకుండా అడ్డుకట్ట విస్తృత తనిఖీలు చేస్తూ ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారు,
వెండిని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.50వేలకుపైగా నగదు ఉన్నా.. పది గ్రాములకుపైగా
బంగారం ఉన్నా అందుకు సంబంధించిన పత్రాలను తనిఖీ అధికారులకు చూపించాల్సిందే.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన అనంతరం రూ.300కోట్లకుపైగా సొత్తును తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.307.02కోట్లు విలువైన నగదు, మద్యం, ఆభరణాలను పట్టుకున్నారు. అక్టోబర్ 9 నుంచి రూ.105.58కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.13.58కోట్ల విలువైన మద్యం, రూ.15.23కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ.145.67 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఓటర్లను ప్రభావితం చేసేందుకు సిద్ధం చేసిన రూ.26.93కోట్ల విలువైన ఇతర కానుకలను సైతం స్వాధీనం చేసుకున్నారు.