4వేల పింఛన్ ఏమైంది?
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గం చెన్నూర్‌లోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఐదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సోమవారం మంత్రి వివేక్ ప్రచారానికి వెళ్లారు.
- క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక్‌ను నిలదీసిన వృద్ధురాలు
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 9: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గం చెన్నూర్‌లోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఐదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సోమవారం మంత్రి వివేక్ ప్రచారానికి వెళ్లారు. మంత్రి ప్రసంగిస్తూ కొత్త రేషన్ కార్డులు ఇచ్చామంటూ చెప్తుండగా అక్కడికి వచ్చిన ఓ వృద్ధురాలు ‘కాంగ్రెస్ గెలిస్తే రూ.4వేల పింఛన్ ఇస్తామన్నారు.. పింఛన్ ఎక్కడికి పోయింది.. ఇంకెప్పుడు ఇస్తారు.. అంటూ ప్రశ్నించింది. ఆమె మాటలకు మంత్రి చిరాకుపడుతూ ‘అరే అమ్మా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారమ్మా’ అంటూ మైక్‌లోనే తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెకు సమాధానం చెప్పలేక మంత్రి చిరాకు పడటం, ఇటీవల మంత్రి ఎక్కడికి వెళ్లినా స్థానికుల నుంచి నిలదీతలు ఎదురవుతుండటం చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

