కేసీఆర్ పాలనలో విద్యాప్రగతి అద్భుతం
కేసీఆర్ పా లనలో విద్యారంగం గొప్ప ప్రగతి సాధించిందనడానికి నీతి ఆయోగ్ వెల్లడించిన గణాంకాలే సాక్ష్యమని మాజీ మంత్రిహరీశ్‌రావు స్పష్టం చేశారు.
- ఇందుకు నీతి ఆయోగ్ తాజా నివేదికే సాక్ష్యం
- ప్రాథమిక పాఠశాల స్థాయిలో జీరో డ్రాపౌట్స్
- బీఆర్ఎస్పై అసత్య ప్రచారాలు చేసేవారికి ఈ నివేదిక చెంపపెట్టు
- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పా లనలో విద్యారంగం గొప్ప ప్రగతి సాధించిందనడానికి నీతి ఆయోగ్ వెల్లడించిన గణాంకాలే సాక్ష్యమని మాజీ మంత్రిహరీశ్‌రావు స్పష్టం చేశారు. రాజకీయాల కోసం కేసీఆర్‌పై అసత్య ప్రచారాలు చేసేవారికి ఈ నివేదిక చెంపపెట్టుగా అభివర్ణించారు. నీతి ఆయోగ్ సూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా (2014-15 నుంచి 2024-25) నివేదికపై హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో జీరో డ్రాపౌట్స్ నమో దు కావడాన్ని నీతి ఆ యోగ్ ప్రశంసించిందని, ఇది బీఆర్ఎస్ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ‘కేసీఆర్ హ యాంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్, బీజేపీ, కొంతమంది స్వ యం ప్రకటిత మేధావులు ఆరోపణల పచ్చి అబద్ధాలని నీతి ఆయోగ్ నివేదికతో తేటతెల్లమైంది’ అని చెప్పారు.
నీతి ఆయోగ్ నివేదికలోని ముఖ్యాంశాలు
- ప్రాథమిక స్థాయిలో జాతీయ సగటును మించి విద్యార్థుల నమోదు ఉన్నది. 2014-15లో 105.64 శాతంగా ఉన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, 2024-25 నాటికి 114 శాతానికి చేరింది. సెకండరీ స్థాయిలో బాలికల నమోదు రేటు 101.5 శాతానికి పెరుగడం ఒక రికార్డు
- రాష్ట్రంలోని 95.1 శాతం పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం ఉన్నది. గతంలో ఇది 92.6 శాతం మాత్రమే. రాష్ట్రంలోని 86 శాతం పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యం ఉన్నది. పదేండ్ల క్రితం ఇది కేవలం 37.9 శాతంగా మాత్రమే ఉండేది. బాలుర మరుగుదొడ్ల సౌకర్యం 57 నుంచి 86.7 శాతానికి, బాలికల మరుగుదొడ్ల సౌకర్యం 70.7 నుంచి 92.9 శాతానికి మెరుగుపడింది.
- జాతీయ సగటున ప్రతి 26 మంది విద్యార్థులకూ ఒక టీచర్ ఉండగా, తెలంగాణలో ప్రతి 22 మంది విద్యార్థులకూ ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నారు. భాషా సామర్థ్యం, గణిత సామర్థ్యం, విద్యుత్తు సౌకర్యం, కంప్యూటర్ విద్య అంశాల్లో జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ గణనీయంగా ముందంజలో ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

