హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం రేపాయి. శుక్రవారం నగరంలోని 8 చోట్ల ఫైనాన్సియర్ల ఇండ్లలో ఏకకాలంలో జరిపిన ఈ సోదాల్లో రూ.72.75 లక్షల నగదుతోపాటు రూ.6.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ సామగ్రిని సీజ్ చేసినట్టు ఈడీ అధికారులు ప్రకటించారు.
మనీ లాండరింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో సురేష్ అగర్వాల్, రక్షిత అగర్వాల్, సీఎస్కే రియల్టర్ల ఇండ్లలో ఈ సోదాలు నిర్వహించినట్టు తెలిపారు.