KTR | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం మరోసారి నోటీసులిచ్చారు. ఈనెల 16న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరారు.
హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసి ఉన్నందున విచారణకు రాలేనని సోమవారం రాత్రి కేటీఆర్ సమాధానం ఇవ్వడంతో మరో తేదీ ప్రకటిస్తామని ఈడీ చెప్పింది. అయితే, కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈనెల 16న విచారణకు రావాలని ఈడీ అధికారులు కేటీఆర్కు నోటీసులు పంపారు. కాగా, ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి నోటీసులిచ్చారు.