ఉత్తర తెలంగాణలో సోమవారం సాయంత్రం భూప్రకంపనలు కలకలం రేపాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల భూమి కంపించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం మండలాల్లో 10 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదైనట్లు తెలుస్తోంది.
ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. కాగా,