హైదరాబాద్: డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. నిరుద్యోగులు పోరుబాటపట్టినా పట్టించుకోని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ డీఎస్సీ అభ్యర్థి గోపీ (DSC Aspirant Gopi) ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. తానుంటున్న ఓ హాస్టల్ గదిలోనే ఆమరణ దీక్షకు కూర్చున్నాడు. డీఎస్సీ అభ్యర్థుల మహాధర్నాను కాంగ్రెస్ పట్టించుకోలేదని, ప్రభుత్వ ఏర్పాటు కోసం మమ్మల్ని వాడుకుని వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు సోమవారం స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గోపీ ఆవేదనను వ్యక్తం చేశాడు. నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇవ్వండంటూ పోలీసు ఆఫీసర్ కాళ్లు మొక్కి వేడుకున్నాడు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఎలాంటి అరాచకాలకు పాల్పడటం లేదన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని పేర్కొన్నాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే బెటర్ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. హాస్టల్ గదిలోనే డీఎస్సీ అభ్యర్థి ఆమరణ నిరాహార దీక్ష
డీఎస్సీ అభ్యర్థుల మహాధర్నాను కాంగ్రెస్ పట్టించుకోలేదు.. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ మమ్మల్ని వాడుకుని వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేసిన డీఎస్సీ అభ్యర్థి గోపి. pic.twitter.com/Xdbx2HoI25
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024
DSC | నిరసనలు తెలిపేందుకు అవకాశమివ్వండి.. పోలీసు కాళ్లు మొక్కిన ఓ నిరుద్యోగి.. వీడియో