DSC | నిరసనలు తెలిపేందుకు అవకాశమివ్వండి.. పోలీసు కాళ్లు మొక్కిన ఓ నిరుద్యోగి.. వీడియో
DSC | డీఎస్పీ రాత పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి డీఎస్సీ అభ్యర్థులు పిలుపునిచ్చారు.
DSC | హైదరాబాద్ : డీఎస్పీ రాత పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి డీఎస్సీ అభ్యర్థులు పిలుపునిచ్చారు. దీంతో భారీ సంఖ్యలో డీఎస్సీ అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇవ్వండంటూ ఆ అభ్యర్థి పోలీసు ఆఫీసర్ కాళ్లు మొక్కి వేడుకున్నాడు. మేం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం.. ఎలాంటి అరాచకాలకు పాల్పడడం లేదు.. మా డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని పేర్కొన్నాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బీఆర్ఎస్ గవర్నమెంటే బెటర్ అంటూ అతను తెలిపాడు.
ఇక డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద చేరుకున్న ప్రతి అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
డీఎస్సీ పరీక్ష వాయిదా వేసి పోస్టులు పెంచాలని పోలీసుల కాళ్ళు మొక్కిన నిరుద్యోగి pic.twitter.com/ki5lAjBWck
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arnab Cyclone | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. ఏపీలో మరో ఏడు రోజులు కుండపోత వర్షాలు..!
‘నవంబర్ 3న జరిగే జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి’
అప్పాజీపేట, నర్సింగ్‌బట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Shiva Nirvana | బాలకృష్ణతో శివ నిర్వాణ సినిమా .. మైసూర్లో కథ వినిపించిన దర్శకుడు!
మున్నూరు కాపుల జనాభా తగ్గింపుపై కుట్ర : దేవయ్య పటేల్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

