సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. 10 రూపాయలకు సాంబార్ ఇవ్వలేదని కర్రీపాయింట్లో ఓ తాగుబోతు గొడవకు దిగాడు. ఆగ్రహంతో తల్వార్ తీసుకుని వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్లే.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఓం శ్రీ సాయి కర్రీ పాయింట్లో ఉదయ్(27), అజయ్ (19) అన్నదమ్ములు పనిచేస్తున్నారు. వీరి వద్దకు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి వచ్చి 10 రూపాయల సాంబార్ ఇవ్వాలని అడిగాడు. అందుకు వారు నిరాకరించారు. తమ వద్ద కర్రీ రూ.30 ఉంటుందని చెప్పారు. దీంతో రూ.30 సాంబార్‌ను రూ.10కే ఇచ్చేయాలని గొడవకు దిగాడు.
వారు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన తాగుబోతు.. తన వెంట తెచ్చుకున్న తల్వార్‌తో విరుచుకుపడ్డాడు. కర్రీపాయింట్ షటర్ మూసివేసి మరీ క్యాషియర్వారిని నరికాడు. ప్రాణభయంతో వారు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. ఈ ఘటనలో ఉదయ్, అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఉదయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రూ.10కి సాంబార్ ఇవ్వలేదని కర్రీ పాయింట్లో పని చేసే వ్యక్తిపై దాడి
సంగారెడ్డి జిల్లా బీరంగూడ పరిధిలోని ఓ కర్రీ పాయింట్లో రూ.10కి సాంబార్ అడిగితే ఇవ్వలేదని, క్యాషియర్ ఉదయ్ తలపై కత్తితో దాడి చేసిన జీవన్ అనే వ్యక్తి
గమనించి షాపు షట్టర్ మూసేసి, దాడిని అడ్డుకుని, గాయాల పాలైన ఉదయ్… pic.twitter.com/2NXuZkadVH
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2026
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు వచ్చేలోపు నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనాస్థలిలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. దాడి చేసిన వ్యక్తి అంబేద్కర్ కాలనీకి చెందిన జీవరత్నంగా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Also : Hyderabad | బ్లౌజ్ సరిగ్గా కుట్టలేదని రూ.లక్ష జరిమానా.. హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ తీర్పు