హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : 2022 జూన్ నుంచి 2025 జూలై వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారిలో 40 ఏండ్లలోపు వారు 14,000 మంది ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇందులో పురుషులు 13,684 మంది, మహిళలు 316 మంది ఉన్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో 2020 జనవరి నుంచి 2025 జూలై వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన 40 ఏండ్లలోపు యువత వివరాలు ఇవ్వాలంటూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి సమాచార హక్కు చట్టం కింద కోరారు. దీంతో పోలీసులు ఈ వివరాలు వెల్లడించారు.