హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): అక్టోబర్‌లో రూ.11.61 కోట్ల విలువైన గంజాయి, ఇతర డ్రగ్స్‌ను దహనం చేసినట్టు ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెలలో ఆంధ్రా ఒడిశా బార్డ ర్ నుంచి గంజాయి.. బెంగళూర్, గోవా, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న డ్రగ్స్‌ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నట్టు చెప్పారు. 703 కేసుల్లో పట్టుబడిన 7,951 కిలోల గంజాయి, డ్రగ్స్‌ను ఆయా జిల్లా కేంద్రాల్లో దహనం చేసినట్టు చెప్పారు. వీటి విలువ రూ.11,61,90,294 ఉంటుందని వెల్లడించారు. వీటితోపాటుగా ఆయా జిల్లాల్లో నిల్వ చేసిన రూ.75 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్‌ను దహనం చేయనున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదుకు గడు వు పొడిగించాలని పురుషోత్తం చాట్లపల్లి కోరారు. మంగళవారం సీఈవో సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీంతో సీఈ వో సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ల ఓటరు నమోదు ప్రక్రియ బుధవారం తో ముగియనున్నదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ల ఓటరు నమోదు చాలా తక్కువగా నమోదైనందున గడువు పొడిగిం చాలని ఆయన కోరారు.