సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ లారీ డ్రగ్స్‌ను గుర్తించి వాటిని సీజ్ చేశారు. వాటి విలువ రూ.50 కోట్లు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవు నుంచి వాటిని ముంబైకి తరలిస్తున్నారని తెలుస్తున్నది.
పట్టుబడిన డ్రగ్స్‌ను చిరాగ్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, లారీ డ్రైవర్, క్లీనర్ పరారైన్లు అధికారులు వెల్లడించారు.ఈ తనిఖీల్లో డీఆర్ఐ, నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, దీనివెనక ఎవరున్నారనే విషయమై ఆరాతీస్తున్నారు.