Home
Telangana
Drought Damage Should Be Assessed For Drying Crops Cpm State Secretary Group Member Julakanti Rangareddy
కరువు నష్టం అంచనా వేయాలి
ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు.
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నల్లగొండ, మార్చి 4 : ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. నల్లగొండ పట్టణ సమీపంలోని కేశరాజు పల్లిలో నీరు లేక ఎండుతున్న వరి పొలాలకు ట్యాంకర్ ద్వారా రైతులు నీళ్లు పెడుతున్న విషయం నమస్తే తెలంగాణలో ప్రచురితం కాగా వారు అక్కడికి వెళ్లి వరి పొలాలను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ దాసరి హరిచందనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా కమిటీ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

