హైదరాబాద్‌లో మూసీనది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తింది. పురానాపూల్ వద్ద 13 అడుగుల మేర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తున్నది. ఎంజీబీఎస్‌ను వరద చుట్టుముట్టింది. బస్టాండ్ లోపలికి వెళ్లే రెండు బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవహించింది. బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌లు వరద నీటితో మునిగిపోయాయి. చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జి పైనుంచి మూసీ వరద ప్రవహిస్తున్నది. ముసారంబాగ్ బ్రిడ్జి పైనుంచి 10 అడుగుల ఎత్తులో వరద పారుతున్నది. మూసీ చుట్టుపక్కల కాలనీలు, బస్తీల్లోకి వరద ముంచెత్తింది.
డ్రోన్ విజువల్స్
హైదరాబాద్ నగరంలో ఉదృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
హిమాయత్ సాగర్ గేట్లు ఒకేసారి ఎత్తడంతో భారీగా ప్రవహిస్తున్న మూసీ
రక్షణ చర్యలు చేపడుతున్న అధికారులు https://t.co/lGf4Z42hU2 pic.twitter.com/9lSK7Xxwri
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2025