తూప్రాన్: మెదక్ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే గ్రామాల్లో తాగునీటి సమస్య (Drinking Water) నెలకొంది. రామాయంపేట మండలంలో చాలా గ్రామాల్లో తాగు నీరు సరిగ్గా రాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోడంతో వ్యవసాయ బోరు మోటార్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే కూడా సన్నటి దారగా రావడం వల్ల గంటల తరబడి నల్లాల వద్ద నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదన్నారు. ఒకవేళ మిషన్ భగీరథ నీటికి సమస్య వస్తే గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న బోరు మోటర్లను ఎప్పటికప్పుడు సిద్ధం చేసి ట్యాంకులతోపాటు మినీ ట్యాంకులకు నీటిని అందించి తాగునీటి సమస్య రాకుండా చూసేవారని మహిళలు అంటున్నారు. ఇంతకంటే తీవ్రత ఎండలు ఉన్న సమయంలో కూడా నీటిని అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఆయన విలువ ఇప్పుడు తెలుస్తుందని ప్రజలు గుర్తుచేసుకొని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.