శంషాబాద్ రూరల్, అక్టోబర్ 7: శంషాబాద్ ఎయిర్పోర్టులో 2.25 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు భారీ ఎత్తున బంగారం తీసుకొస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 2.25 కోట్ల విలువైన బంగారం పట్టుబడినట్టు తెలిపారు.