హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): సివిల్ అసిస్టెంట్ సర్జన్ల (మెడికల్ ఆఫీసర్లు) బదిలీలకు వైద్యారోగ్యశాఖ కసరత్తు చేస్తున్నది. వీరి బదిలీలను కొన్ని క్యాటగిరీలకే పరిమితం చేసింది.
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్) పరిధిలో పనిచేస్తున్న స్పౌజ్, 70శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు, బుద్ధిమాంద్యం పిల్లలున్నవారు, కారుణ్య నియామకాల కింద భ ర్తీ అయిన వితంతువులు, క్యాన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీ వం టి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మెరుగైన చికిత్స దొరికే ప్రాంతాలకు వెళ్లడానికి ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.