తొర్రూరు, నవంబర్ 22 : పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్ సెంటర్లో శనివారం ఆందోళన నిర్వహించారు. సీపీఎం నేతృత్వంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు.
ఆందోళనకారులు మాట్లాడుతూ.. సమస్యలు చెప్పుకుందామంటే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గోపాలగిరి రోడ్డులో నిర్మించిన 280 ఇండ్లను తక్షణమే పేదలకు పంపిణీ చేయాలని పలుమార్లు ఎమ్మెల్యేను కోరినా స్పందించడం లేదని విమర్శించారు.