సైదాబాద్, సెప్టెంబర్ 29 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం గృహాలను మూసి బాధితులకు కేటాయించడం ఎంత వరకు సమంజసమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల మూసీ పరివాహక ప్రాం తంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టగా, ప్రభుత్వం వారికి సైదాబాద్‌లోని పిల్లిగుడిసెల డబుల్బెడ్రూం గృహాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆదివారం రాత్రి అక్కడికి చేరుకొని ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వా దం చోటు చేసుకుంది. దీంతో కొత్తగా వచ్చిన వారి మధ్య గొడవ కాస్త ఉద్రిక్తతంగా మారడంతో మాదన్న పేట పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.