Harish Rao | రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతా ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన నిరుద్యోగ యువత నిరసన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన 3 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతా ఉన్నాయన్నారు.
మొన్న గజ్వేల్‌లోని శ్రీ కృప ఫార్మసీ కాలేజీలో చదువుకునే పిల్లలు నా దగ్గరకు వచ్చారు. ‘అన్నా, మా బీ ఫార్మసీ అయిపోయింది. కానీ కాలేజీ వాళ్లు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మాకు ఎం ఫార్మసీలో సీటు వచ్చింది. సర్టిఫికెట్లు ఇస్తే మేము పోయి ఎం ఫార్మసీలో జాయిన్ అవుతాం. నాలుగో తారీఖే లాస్ట్ డేట్’ అని చెప్పారు. నేను కాలేజీ వాళ్లకు ఫోన్ చేశాను. కాలేజీ వాళ్లు మూడేళ్ల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. మేము ఎలా సర్టిఫికెట్లు ఇస్తాం..? మేము లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మేము సర్టిఫికెట్లు ఇవ్వవలేము అంటున్నారు. పిల్లలేమో కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. రెండు రోజులే టైమ్ ఉంది అన్నా. మేము ఎం ఫార్మసీలో జాయిన్ కాకపోతే మా విద్యా సంవత్సరం నష్టపోతాం అని పిల్లలు ఒకవైపు బాధపడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇవాళ ఎందుకు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదని నేను అడుగుతున్నానన్నారు హరీశ్ రావు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్టిన రెండు వేల కోట్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. బీఆర్ఎస్ తొమ్మిది ఏళ్లలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇచ్చి పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఫార్మసీ, లా తదితర కోర్సుల్లో చదివించింది. కానీ ఈ రేవంత్ రెడ్డి మాటలే ఎక్కువ, చర్యలు తక్కువ. ఫీజు రీయింబర్స్మెంట్ అమలే కావడం లేదు. మా పాలిటెక్నిక్ పిల్లలు వచ్చారు పాపం, ఇవాళ ఈ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటు పరం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు మండిపడ్డారు. పిల్లల దగ్గర ఫీజు రూ.5 వేలో, రూ.15 వేలో కడితే మూడేళ్ల పాలిటెక్నిక్ అయిపోతుంది. దీన్ని తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలుపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి.
మీ భవిష్యత్తుతో చెలగాటం..
స్కిల్ యూనివర్సిటీ అంటే మీరు అక్కడ బ్లూ కాలర్ జాబ్ చేయాలి ఫిట్టర్, ఎలక్ట్రిషన్, మెకానిక్, ప్లంబర్ జాబ్ చేయమంటున్నారు రేవంత్ రెడ్డి. మేం పాలిటెక్నిక్ చదువుకుంటాం. మేము ఇంజనీర్లమవుతాం. మేము సివిల్ ఇంజనీర్లం అవుతాం, మెకానికల్ ఇంజనీర్లం అవుతాం, ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్లం అవుతాం అంటే ‘లేదు, లేదు, లేదు. మీరు ఫిట్టర్ కావాలి, మీరు ఎలక్ట్రిషియన్ పని చేయండి, బ్లూ కాలర్ ఉద్యోగాలు చేయండి’ అని చెప్పి మిమ్మల్ని తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలుపుతా ఉన్నారు. మీ భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ పాలిటెక్నిక్‌ను స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే విద్యను ప్రైవేటుపరం చేయడం. మీరంతా గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో చదువుతున్నారు.
స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రైవేట్ యూనివర్సిటీ పీపీపీ మోడల్లో పెట్టారు, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్. స్కిల్ యూనివర్సిటీ అంటే ఈ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటుపరం చేయడం. స్కిల్ యూనివర్సిటీలో ఆరు నెలల చదువుకు రూ.50 వేల ఫీజు ఉంది. వన్ ఇయర్ కోర్సుకు రూ.80 వేల ఫీజు పెట్టారు. మరి పాలిటెక్నిక్‌లో మీరు రూ.5 వేలకే చదువుతున్నారు కదా.. ఎస్బీటీఈటీ కింద మీరు సక్కగా చదువుకుంటున్నారు. ఈ పాలిటెక్నిక్‌లను స్కిల్ యూనివర్సిటీలో కలపాలనే జీవో 97ను వెంటనే రద్దు చేయాలని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉందని హరీశ్ రావు అన్నారు. పాలిటెక్నిక్ పిల్లలతో చెలగాటం ఆడకండి. కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దని కూడా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నామన్నారు.\
January 12 Vidudala | వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి లీకుల బెడద.. సెట్ నుండి బయటకొచ్చిన సాంగ్ వీడియోలు!
KTR | కేటీఆర్‌కు అలుగునూరులో ఘనస్వాగతం.. పోటీపడి రాఖీలు కట్టిన మహిళలు
New World Map: కొత్త ప్రపంచ పటం .. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు