మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి తరలించవద్దని కోరుతూ అఖిలపక్షం నాయకులు, గ్రామస్తులు శుక్రవారం హన్వాడ మండల కేంద్రంలోని మహబూబ్‌నగర్-తాండూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నాటి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండల కేంద్రంలో గురుకుల పాఠశాలను ఏర్పాటుచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు మార్చాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న క్రమంలో కరెంట్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. కొందరు సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో, మరికొందరు బంధువుల ఇండ్లలోకి వెళ్లి చదువుకున్నారు
హైదరాబాద్‌లోని రహమత్ నగర్ డివిజన్ గిరిజన బాలుర వసతి గృహంలో పురుగుల అన్నం పెడుతున్నారని శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాణ్యత లేని భోజనంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనతో బోరబండకు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.