హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సభలో ప్రశ్నోత్తరాలకు గంట సమయం కేటాయించినట్టు ప్రతిరోజూ 10 ప్రశ్నలుంటాయని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే సభలో ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాలను దృష్టిలో ఉంచుకొని సభ్యులు సుదీర్ఘ ఉపన్యాసం చేయరాదని, కేవలం ప్రశ్నలకే పరిమితం కావాలని, మంత్రులు సైతం సభ్యులడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలివ్వాలని, ఎజెండా ముందుకు సాగేందుకు సభకు పూర్తిగా సహకరించాలని కోరారు.
రాష్ట్రంలోని పంచాయతీలకు అధికారాలు, హక్కులు, నిధులులేవని ఇబ్రహీంప ట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. కనీసం బల్బుపోతే వేసుకోలేని దుస్థితిలో జీపీలు ఉన్నాయని వాపోయారు. మండల కేంద్రాల్లో నాలుగులేన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కోరారు.
కాలుష్యకారక పరిశ్రమలపై ఫిర్యాదు చేసినా పీసీబీ పట్టించుకోవడం లేదని జ డ్చర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుధ్‌రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముదిరెడ్డిపల్లి చెరువు కాలుష్యం పై ఆయన ప్రశ్నించారు. పోలేపల్లి సెజ్‌లో అమాన్యుల్, అరబిందో ఫార్మా సంస్థల కాలుష్యంపై నివేదిక కోరతామన్నారు.
పలు దేవాలయాలు, పర్యాటక ప్రాం తాలతో కూడిన నల్లమలను టూరిస్ట్ హబ్ గా తీర్చిద్దాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్ట ర్ వంశీకష్ణ కోరారు. ఇక డోర్నకల్ ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధిచేయాలన్నారు. నాగార్జునసాగర్‌లో మినీ జూపార్క్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, దేవరకొండ దుర్గాన్ని అభివృద్ధిచేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కోరారు. వీటిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సానుకూలంగా స్పందించారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి, ఊకే అబ్బ య్య, డీ రామచంద్రారెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి సంబంధించిన బిల్లులను మంత్రులు శ్రీ ధర్‌బాబు, దామోదర ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలో 334 పంచాయతీలకు బీటీ రోడ్లు లేవని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 12,941 గ్రామ పంచాయతీలుంటే, 12,607 పంచాయతీలకు రోడ్లు ఉన్నాయని ప్రశ్నోత్తరాల సమయం లో ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, నేనావత్ బాలూనాయక్, మల్రెడ్డి రంగారెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.