హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు కోరం ఉన్నప్పటికీ ఎన్నిక ఎందుకు నిలిపివేశారని కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తున్న అరాచకాలపై మంగళవారం కేటీఆర్ ఎన్నికల కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీకి పక్షపాతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నదేమోనన్న అనుమానం వ్యక్తంచేశారు.