HomeTelanganaDoctors Who Will Join 34 Specialty Departments In Medical Colleges
అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా 1,442 మంది ఎంపిక
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్‌బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) విడుదల చేసింది.
ఎంపికైనవారి జాబితా విడుదల
5 నెలల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి
మెడికల్ కాలేజీల్లోని 34 స్పెషాలిటీ విభాగాల్లో చేరనున్న వైద్యులు
మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్‌బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ఆరోగ్య తెలంగాణలో భాగంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీని సైతం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వెంటవెంటనే చేపట్టింది.
ఆ ప్రక్రియను కేవలం ఐదు నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేసింది. పారదర్శకంగా భర్తీ ప్రక్రియ నిర్వహించి, ఎప్పటికప్పుడు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తూ, ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ, అర్హులు ఉద్యోగ అవకాశాలు పొందేలా చర్యలు చేపట్టింది. తాజాగా అందుకు సంబంధించిన మెరిట్ జాబితాను రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. త్వరంలోనే అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కొత్త మెడికల్ కాలేజీల్లో నియామక ఉత్తర్వులను జారీ చేయనున్నారు.
ఎంపికైన వైద్యులకు హరీశ్‌రావు శుభాకాంక్షలు
వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు. రికార్డు సమయంలో నియామకం పూర్తి చేసిన బోర్డుకు అభినందనలు తెలిపారు. మరోవైపు 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీని మొదలు పెట్టినట్టు పేర్కొన్నారు.