Nagarkurnool నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌కు గురైన విద్యార్థులను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పరామర్శించేందుకు వెళ్తున్న విషయం తెలియడంతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిపోయింది. హరీశ్‌రావు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో ఆస్పత్రి నుంచి విద్యార్థులను వెంటనే డిశ్చార్జి చేసి, పోలీసుల బందోబస్తు మధ్య ఇంటికి తరలించారు. కాగా, విద్యార్థులకు పూర్తిగా నయం కాకముందే డిశ్చార్జ్ చేయడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో ఉన్న మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో (Gurukula School) రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 79 మంది బాలికలను పాఠశాల సిబ్బంది దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. 12 మంది డిశ్చార్జి అవగా, ఇంకా 67 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. పూర్తిగా తోడుకోని పెరుగు తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తున్నది.
ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకంత భయం @revanth_anumula ?
ఆనాడు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల విద్యార్థిని మృతదేహాన్ని నిర్బంధాల మధ్య హైదరాబాద్ నుండి తరలించారు.
నేడు ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల… pic.twitter.com/8Ltxm02hX2
— Harish Rao Thanneeru (@BRSHarish) July 27, 2025