Dr. Namrata : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Dr. Namrata) పోలీస్ కస్టడీ ముగిసింది. గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఆమెకు వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం పోలీసులు నమ్రతను కోర్టులో హాజరు పరిచారు. ఆ తర్వాత గోపాలపురం పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు 12మందిని పోలీసులు అరెస్ట్ చేయగా సోమవారం డాక్టర్ విద్యుల్లత ను శంషాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. తనపై కేసు ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో విద్యుల్లతను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పర్మిషన్లు కూడా విద్యుల్లత పేరుమీదనే తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యుల్లత ఇద్దరూ కలిసి హైదరాబాద్లో ఐవీఫ్, సరోగసీ పేరిట అమాయక ప్రజలను మోసం చేసి లక్షలు లక్షలు గుంజారంటూ పోలీ సులు పేర్కొన్నారు. మరోవైపు సంస్థ నిర్వాహకులు ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గోపాలపురం పోలీ సులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
A Nampally court, on Friday, granted five-day police custody of Dr Namrata, accused of running an illegal surrogacy and sperm racket in Secunderabad.
She ran Shrishti Fertility Center, along with her son, Pachipala Jayanth Krishna. Both have been named prime accused in the… pic.twitter.com/MgtfJbuzUI
— The Siasat Daily (@TheSiasatDaily) August 1, 2025
తమకు సృష్టి సెంటర్ ఇచ్చిన మెడికల్ రిపోర్టులు, వారికి డబ్బులు కట్టిన రసీదులు, ఇతర ఆధారాలు తీసుకుని వచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు చెందిన దంపతుల నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకురాలు నమ్రత ఒకరి దగ్గర రూ.44లక్షలు, సరోగసీ పేరుతో హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి విశాఖకు పిలిచి అక్కడ స్పెర్మ్ తీసుకుని రూ.18లక్షలు తీసుకున్నారని ఒకరు, ఎన్నారైల నుంచి రూ.25లక్షలు, హైదరాబాద్కు చెందిన వారి దగ్గర నుంచి రూ.50లక్ష లు తీసుకున్నట్లుగా బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నమ్రత, డా.విద్యుల్లత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖ,కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిలపై వేర్వేరుగా కేసు నమోదు చేశారు.