అమరచింత, జూన్ 26 : కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో చేస్తున్న భూకబ్జాలను అడ్డుకుంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కత్తులతో దాడి చేస్తరా? అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు దాడిలో గాయపడిన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాలలోని బీఆర్ఎస్ నాయకుడు నర్సింహులును శుక్రవారం ఆయన పరామర్శించారు.
బాధితుడు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి దాడిచేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని ఎస్సై జయన్నకు ఫిర్యాదు చేశారు. దాడిచేసిన వారిపై కేసు నమోదుచేసి అరెస్టు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.