హైదరాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : పత్తిపై 11శాతం దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడాన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తెలిపారు. ఇప్పటికే తీవ్ర దోపిడీకి గురవుతున్న లక్షలాది పత్తి రైతులు, కార్మికులను ప్రమాదంలో పడేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సుంకం మినహాయింపు ప్రకటించిన వెంటనే ఈ ధరలు 3% పడిపోయాయని చెప్పారు. మారుతున్న వాతావరణం, ఎల్నినో వల్ల పత్తి రైతులు ఇప్పటికే అనిశ్చితిని ఎదురొంటున్నారని, ప్రభుత్వం వారికి అండగా నిలువాలని డిమాండ్ చేశారు.
రైతులకు నష్టం
పత్తిపై దిగుమతి సుంకాన్ని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వారు తెలిపారు.