Padi Kaushik Reddy | ఇటువంటి అక్రమ అరెస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం కరీంనగర్ త్రీ టౌన్ పోలీసు స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చేందుకు తీసుకెళ్తుండగా పోలీస్ వాహనం నుంచి జై తెలంగాణ అంటూ నినాదం చేశారు. అమ్ముడు పోయిన ఒక ఎమ్మెల్యే ను నిలదీసినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని, పండగ పూట రాత్రంతా పోలీసు స్టేషన్ లోనే ఉంచారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో కరీంనగర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానల్ ముందు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. వెంటనే కరీంనగర్‌కు తరలించారు. రాత్రంతా ఆయన్ను త్రీటౌన్ పీఎస్‌లోనే నిర్బంధించారు. మంగళవారం ఉదయం స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ ఆయన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే సమయంలో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి
ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేదిలేదన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి https://t.co/fZ3RkE5RVC pic.twitter.com/kBmq0fWTfl
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2025
మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి నేపథ్యంలో ఆందోళనలు చేపట్టకుండా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కేటీఆర్, కోకాపేటలో హరీశ్‌రావును గృహ నిర్బంధం చేశారు. వారి నివాసాల ముందు భారీగా పోలీసులు మోహరించారు.