RS Praveen Kumar | మిగతా గ్యారంటీల తరహాలో నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేయవద్దని నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ గ్యారంటీల్లో భాగంగా తెలంగాణలో నేడు లక్షలాదిమంది నిరుద్యోగులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని ఆయన ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా తెలిపారు. వారి ఆశలు అడియాశలు చేయకుండా ఎన్నికల సందర్భంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని కోరారు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ జాబ్ క్యాలెండర్లో తేదీలతో సహా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాంగ్రేసు గ్యారంటీలలో భాగంగా తెలంగాణలో ఈ రోజు లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నరు. మిగతా గ్యారంటీల లాగానే అందరినీ ఏప్రిల్ ఫూల్స్ ని చేయరనే ఆశిస్తున్నా @revanth_anumula @TelanganaCMO గారు! pic.twitter.com/wQDHW66RHh
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 1, 2024