హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను రేషన్ షా పుల ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలను సివిల్ సైప్లె శాఖ ద్వారా రేషన్ షాపుల్లోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం బుధవారం తెలిపారు.
హైదరాబాద్, మే6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దూదేకుల వర్గానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తున్నదని దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అజీమొద్దీన్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మహమ్మద్ రాజ్ మహమ్మద్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దూదేకులవర్గానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, రిజర్వేషన్లలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు.