హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అదేరోజూ అన్ని నియోజకవర్గాల్లో మం త్రులు, ఎమ్మెల్యేలు రేషన్‌కార్డులను పంపి ణీ చేస్తారు. ఆరు నెలల్లో 41 లక్షల కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కార్డుల సంఖ్య 94,72,422కు చేరుతుంది.