రంగారెడ్డి, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మంకాల్లో మహేశ్వరం, మలక్పేట, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ల్యాండమైజేషన్లో కేటాయించిన 2,230 ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే బలాల, జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తదితరులు పాల్గొన్నారు.