నారాయణపేట: ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమవడంతో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. తాజాగా నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఉద్రిక్తత నెలకొన్నది. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసుల పహారా మధ్య గ్యాస్ పంపిణీ చేపట్టారు.
ఆన్లైన్లో బుక్ చేసుకున్న 60 మంది వినియోగదారులకు సిలిండర్లు అందజేశారు. ఒక్కసారిగా డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి పెరగడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.