వరంగల్ : వరంగల్(Warangal) జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. తాజాగా గీసుకొండ మండలంలోని ధర్మారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(MLA Revuri Prakash Reddy), మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వర్గీయుల మధ్య వివాదం(Disputes) చిలికిచిలికి గాలివానలా మారింది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయనప్పటి నుంచే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలేరుగున్నాయి. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు.
ఈ నేపథ్యంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ చేసిన ఆ ముగ్గురిని విడిచి పెట్టాలనే డిమాండ్‌తో ధర్మారం వద్ద వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిపై కొండా వర్గీయుల ధర్నాకు దిగారు. సమస్యను పరిష్కరిస్తామని గీసుకొండ సీఐ మహేందర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్
వరంగల్ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి
దసరా ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫొటో లేకపోవడంతో వివాదం.
నిన్న రేవూరి, కొండా వర్గీయుల మధ్య ఘర్షణ.. కొండా సురేఖ వర్గీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ధర్మారం రైల్వేగేట్… pic.twitter.com/RbjBpHMRmV
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2024