హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 972 సర్కారు స్కూళ్లల్లో డిజిటల్ విద్యనందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లను సరఫరా చేయనుంది. ఒక్కో పాఠశాలకు ఐదు కంప్యూటర్లు, ఒక ప్రింటర్, ఒక 2కేవీఏ సామర్థ్యం గల యూపీఎస్‌ను అందించనుంది. ఇప్పటికే ఓ ఏజెన్సీని ఎంపికచేయగా, ఆయా సంస్థ స్కూళ్లకు చేర్పించేందుకు చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2024లో ఉద్యోగాలు పొందిన కొత్త టీచర్లకు విద్యాశాఖ శిక్షణ ఇవ్వనున్నది. ఈ నెల 28 నుంచి మార్చి 12 వరకు టీచర్లకు జిల్లాల్లో శిక్షణ ఇస్తారు. ఈ నెల 27 నుంచే శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఒకరోజు వాయిదా వేశారు. టీచర్లకు శిక్షణ ఇచ్చే జిల్లా రిసోర్స్ పర్సన్స్‌కు శనివారం రాజేంద్రనగర్‌లోని టీజీ అపార్డ్‌లో శిక్షణ నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.