ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 20:39:54

29న వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

 29న వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

వరంగల్‌ రూరల్‌ : ఈ నెల 29 న వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంత చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హన్మకొండలోని తన నివాసంలో పరకాల రూరల్, నడికూడ, ఆత్మకూర్, దామెర, గీసుగొండ, సంగెం మండలాల టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన  వ్యవసాయ చట్టాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని అన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేట్‌ సంస్థలకు, పెట్టుబడిదారులకు మేలు చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ కొర్రీలు పెడుతుందని ఆక్షేపించారు. రాజకీయాలకు అతీతంగా అన్నిపార్టీల నాయకులు, ప్రజలు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo