AamirKhan | బాలీవుడ్ (Bollywood) ఖాన్ త్రయంలో ఒకడిగా వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అమీర్‌ఖాన్ (AamirKhan). వరుస ఫ్లాపులు పడ్డా ఏ మాత్రం క్రేజ్ తగ్గని ఈ స్టార్ హీరో ఇటీవలే కపిల్ శర్మ టాక్ షోలో పాల్గొన్నాడని తెలిసిందే. ఈ షోలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అందరితో పంచుకున్నాడు అమీర్ ఖాన్.
59 ఏండ్ల వయస్సులో యువకుడిలా కనిపించేందుకు కారణమేంటని షోకు వచ్చిన ఓ గెస్ట్ అడిగారు. దీనికి అమీర్‌ఖాన్ స్పందిస్తూ.. తాను ప్రత్యేకించి ఎలాంటి పనులు చేసేవాడిని కాదని, ఈ విషయంలో క్రెడిట్ అంతా నాన్నదేనని చెప్పుకొచ్చాడు. అబ్బాజాన్ (genes) జన్యువులు బాగున్నాయి. ఈ విషయంలో నాకు ఏ క్రెడిట్ ఉండదు. నేనెప్పుడు వర్కవుట్ చేయలేదు.. నా ముఖంపై ఏ క్రీమ్ కూడా పెట్టుకోలేదు.
అంతేకాదు షాంపూ అంటే ఏమిటో నటుడిని అయ్యాక కానీ నాకు తెలియదు. కానీ ప్రతీ విషయంలో సబ్బునే వాడుతుంటా. నేను మంచి లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకంగా ఒక్క పని కూడా చేయలేదు. ఏదైనా సినిమా వస్తే నా బాడీపై మాత్రమే వర్కవుట్ చేసేవాడిని. నేను చాలా బద్దకిస్టును. ఏదీ చేయకపోయేవాడిని.. అంటూ చెప్పుకొచ్చాడు అమీర్‌ఖాన్ ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అమీర్ ఖాన్ 2016లో వచ్చిన దంగల్ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఆ తర్వాత నటించిన సీక్రెట్ సూపర్ స్టార్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, లాల్ సింగ్ చడ్డా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో ఫ్లాప్ టాక్ మూటకట్టుకున్నాయి. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అమీర్ ఖాన్ ఖాతాలో ప్రస్తుతం Sitaare Zameen Par మూవీ ఉంది.