జయశంకర్ భూపాలపల్లి : కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలు రెట్టింపవుతున్నాయి. ప్రజా పాలన తీసుకొస్తామని చెబితే నమ్మి ఓట్లేసిన ప్రజలు నేడు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలతో ప్రజలు రోడ్డుకెక్కుతున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి (Bhupalapalli) జిల్లాలో డబుల్ బెడ్రూం బాధితులు ఆందోళన బాటపట్టారు. జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ వద్ద నిర్మించిన 430 డబుల్ బెడ్రూం ఇండ్ల(Double bedroom houses) కోసం అసెంబ్లీ ఎన్నికల ముందే కలెక్టర్ లబ్ధిదారులను ఎంపిక చేశారు.
ఇండ్లు కేటాయించాలని పోలీసులను వేడుకుంటున్న మహిళ
హక్కు పత్రాలను ఇవ్వకుండా జాప్యం చేస్తుండడంతో బాధితులు వరుస ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బాధితులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో రోడ్డు పై బైఠాయించి ధర్నా(Dharna) చేపట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకట రాణి, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు వీరికి మద్దతు పలికారు. పోలీసులకు, బాధితులకు వాగ్వివాదం జరిగింది. బాధితులు దండం పెడుతూ న్యాయం చేయాలని పోలీసులను బతిమిలాడారు. న్యాయం చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.