ఖమ్మం రూరల్, జనవరి 29 : ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను (Six guarantees)ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఖమ్మం రూరల్(Khammam) మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి మలీదు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పి కొంతమందికే కల్పించి, మిగతా వారిని విస్మరించిందని ఆరోపించారు.
వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల చొప్పున చెల్లిస్తామని చెప్పి దానిని విస్మరించిం దన్నారు. సొంత జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇంటి కోసం రూ.5 లక్షలు, రైతు భరోసా పథకం ద్వారా రూ.15 వేలు, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు రెంటాల యాదగిరి, వీర్ల వెంకటనారాయణ, ఎడ్లపల్లి ఉపేందర్, బాల్ని యాదగిరి, మాధవరావు, మోహన్‌రెడ్డి, రామదాసు, శ్రీను, లలిత, కోటయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.