Telangana | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ‘అయ్యా నేను ఇప్పటికే 10 సార్లు డీజీపీ ఆఫీసుకు వచ్చినా న్యాయం జరగలేదు. నన్ను కొట్టి నా భూమిని లాక్కున్నారు. నాపై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజావాణిలో ఎన్నోసార్లు ఫిర్యా దు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం జరగకపోతే చావే దిక్కు’ అంటూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు.
గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు తనకు రావాల్సిన 3 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేశారని ఆ వేదన వ్యక్తం చేశాడు. ఆ భూమి కోసం ధర్నాలు చేస్తే, కులబహిష్కరణ చేశారని చెప్పాడు. భార్య, ఇద్దరు ఆడ పిల్లలతో క లిసి డీజీపీ ఆఫీసు ఎదుట కూర్చొని నిరసన తెలిపాడు. అతని గోడు విన్న ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి డీజీపీ కార్యాలయ అధికారులతో మాట్లాడారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసేందుకు అవకా శం కోరగా వారు అంగీకరించారు. దీంతో బాధితుడు ఐజీ చంద్రశేఖర్‌రెడ్డికి తన గో డు వెలిబుచ్చాడు. న్యాయం చేస్తానని ఐ జీ హామీ ఇచ్చినట్టు బాధితుడు తెలిపాడు.