రాయపర్తి, జూలై 17: రైతుల ఉసురుపోసుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్‌లో పుట్టగతులుండవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, అడ్హాక్ కమిటీ మండల సమన్వయకర్త పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని కోరుతూ శుక్రవారం బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం సబ్‌స్టేషన్‌లో ఆందోళన చేపట్టారు. రైతుల పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని మండిపడ్డారు. మైలారం రిజర్వాయర్‌కు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.